మెంటల్ మదిలో ట్రైలర్ చాలా బాగుంది --- చాలా బాగుంది
పెళ్లి చూపులు వంటి సూపర్ హిట్ సినిమాని నిర్మించిన రాజ్ కందుకూరి తాజాగా నిర్మిస్తున్న చిత్రం మెంటల్ మదిలో . శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకుడు . అనేక షార్ట్ ఫిలిమ్స్ ద్వారా విశేష ఆదరణ పొందిన వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ నిన్న సాయంత్రం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు లాంచ్ చేశారు . ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ..' ట్రైలర్ చాలా బాగుంది . ట్రైలర్ లో కథ గురించి చెప్పిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి . పెళ్లి చూపులు తరహాలోనే మెంటల్ మదిలో కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా . వివేక్ ఆత్రేయ ఓ సరికొత్త ప్రయత్నంలో ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు ' అని అన్నారు . నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ ... ' సురేష్ బాబుగారు మా మెంటల్ మదిలో ట్రైలర్ విడుదల చేసి , క్వాలిటి అండ్ కంటెంట్ చూసి మమల్ని అభినందించడం ఆనందంగా ఉన్నది . చాలా పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది . మా టీమ్ అంతా కూడా సినిమా విడుదల పట్ల చాల...