ప్రస్తుతం “అర్జున్ రెడ్డి” క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి రిలీజ్ తర్వాత కూడా అదే యాటిట్యూడ్ ను మెయింటైన్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండకి ఉన్న ఒన్ Iఆఫ్ ది బిగ్గెస్ట్ ఎస్సెట్ “తెలంగాణ యాస”. అతడి పవర్ ఫుల్ టోన్ తో తెలంగాణ యాసలో డైలాగులు చెబుతుంటే ఆంధ్రా అబ్బాయిలు కూడా ఫిదా అయిపోయారు. ఇక తెలంగాణా తమ్ముళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పాలా. అయితే.. ఒక నటుడిగా వేషంలో మాత్రమే కాక భాషలోనే వేరియేషన్ చూపించాలని ఫిక్స్ అయిపోయిన విజయ్ దేవరకొండ.. తన తదుపరి చిత్రంలో ఆంధ్రా అబ్బాయిగా నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. భారత్ కమ్మ అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో విజయ్ కాకినాడ కుర్రాడిగా కనిపించనున్నాడు. సో, పాత్రకి తగ్గట్లుగా పక్కా ఆంధ్రా యాసలో అలరించేందుకు అన్నీ విధాలా రెడీ అవుతున్నాడట. చూద్దాం మరి మన “అర్జున్ రెడ్డి” ఆంధ్రా అబ్బాయిగా ఏమేరకు అలరిస్తాడో.