ఓవరాల్ గా ఇది ‘పూరి , బాలయ్య ల వసూల్ మూవీ

ఈఏడాది లో ఇప్పటికే గౌతమీపుత్ర శాతకర్ణి తో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య , ఇప్పుడు పైసా వసూల్ అంటూ తన 101 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి డైరెక్ట్ చేయడం , ఇంతవరకు ఎవరు చూపించని విధంగా బాలయ్య ను ఈ మూవీ లో చూపించడం , ఆయన చేత డైలాగ్స్ పలికించడం తో ప్రేక్షకులు ఈ మూవీ ఫై అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను అందుకోవడం లో తేడాసింగ్ ఏ మేరకు విజయం సాధించాడు..? వరుస ప్లాప్స్ తో సతమతవుతున్న పూరి ఈ మూవీ తో హిట్ కొట్టాడా లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
బాబ్ మార్లే(విక్రమ్ జీత్) పోర్చుగల్‌లో ఓ పెద్ద మాఫియా లీడర్..బాబ్ తమ్ముడు సన్ని(అమిత్)ను ఇండియన్ రా ఆఫీసర్ (కబీర్ బేడీ) చంపేస్తాడు. దాంతో ఇండియాపై పగబట్టిన బాబ్, ఇండియాలో మారణ హోమం సృష్టించాలని ప్లాన్ చేస్తాడు. ఇదే సమయంలో తేడాసింగ్ (బాలకృష్ణ ) తీహార్ జైలు నుండి బయటకు వస్తాడు. బాబ్ ను పట్టుకోవడానికి ఇండియన్ పోలీసులు చూస్తుంటారు.
కానీ అతడిని పట్టుకోవాలంటే పోర్చుగల్ చట్టాలు, ప్రభుత్వాలు అడ్డు వస్తుంటాయి. దీంతో రా ఆఫీసర్ , తేడాసింగ్ డీల్ కుదుర్చుకుంటాడు. మరి తేడాసింగ్ బాబ్ ను ఎలా పట్టుకుంటాడు..? అసలు తేడాసింగ్ తీహార్ జైలు కు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది..? తేడా సింగ్ కు హారిక(ముస్కాన్) , సారిక(శ్రియా) లతో సంబంధం ఏంటి అనే విషయాలు మీరు తెర చూడాల్సిందే..
ప్లస్ :
* బాలకృష్ణ యాక్టింగ్ , డైలాగ్స్ , ఫైట్స్
* సినిమాటోగ్రఫీ
* ఎడిటింగ్
మైనస్ :
* మ్యూజిక్
* అక్కడక్కడా పూరి గత చిత్రాలు గుర్తుకొస్తాయి.
నటీనటుల పెర్పామెన్స్ :
* ముందుగా బాలయ్య యాక్టింగ్ గురించి చెప్పాలి..ఇప్పటి వరకు ఆయన చేసిన 100 సినిమాలు ఒకెత్తు , ఈ సినిమా ఒకెత్తు అనేలా ఉంది. ఈ మూవీ లో కొత్త బాలయ్య ను చూశామని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. డైలాగ్స్ లోనే కాదు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లలో బాలయ్య కొత్తగా కనిపించాడు.
ముఖ్యం గా బాలయ్య చెప్పే డైలాగ్స్..
– బీహార్‌లో తాగించినవాడిని తీహార్‌లో పోయించా తూ క్యారే అవులే
– నన్ను ఇక్కడ కాల్చాలంటే నా అభిమానులైనా అయ్యి ఉండాలి, నా బంధువులైనా అయి ఉండాలి
– సింహానికి మేక ఎరేయాలనుకోవడం కరక్టే కానీ ఆ ప్లాన్ని మేకలన్నీ కలిపి చేయడమే
– `జేబులో చెయ్యిపెట్టు.. ఏమైనా తగిలిందా..` వంటి మాస్ డైలాగ్స్ ఇలా ఒకటి రెండు కాదు పూరి తన మార్క్ స్టయిల్ డైలాగ్స్ అన్ని బాలయ్య తో పలికించాడు.
* ఇక బాలయ్య పాడిన పాటకు థియేటర్లో విజిల్స్ తో మరోమోగిపోయాయి. ఇంటర్వెల్ కు ముందు బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఓన్లీ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ, ఔటర్స్ నాట్ అలౌడ్ అని చెపుతుంటే నందమూరి అభిమానుల గోల మాములుగా లేదు.
ఇక సాంగ్స్ లలో కూడా హీరోయిన్స్ తో బాలయ్య బాబు రొమాన్స్ అదరగొట్టాడు. మొత్తానికి బాలయ్య బాబు లోని సరికొత్త యాంగిల్ ను పూరి బయటకు తీసాడు.
* ఇక మూవీ లో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నప్పటికి అధిక ప్రాధాన్యం మాత్రం శ్రియకు దక్కింది. పోర్చుగల్ ఎపిసోడ్‌లో ఆమె యాక్టింగ్ ఆకట్టుకుంది. కైరా దత్ ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది. ముస్కాన్ ఓ పాట, కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. బాలయ్య , శ్రీయ ల మధ్య సన్నివేశాలు బాగున్నాయి.
* పూరి సినిమా అంటే అలీ ఖచ్చితంగా కనిపిస్తాడు. ఈ మూవీ లో కూడా అలాగే కనిపించాడు..కానీ కామెడీ పడించలేకపోయాడు. రా ఆఫీసర్ గా కబీర్‌బేడీ రోల్ బాగుంది.
* పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్ జిత్ తమ తమ రోల్స్ లలో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.
సాంకేతిక విభాగం :
ముఖ్యం గా పూరి డైరెక్షన్ గురించి చెప్పాలి..టెంపర్ చిత్రం తర్వాత పూరి నుండి వచ్చిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ లను చవిచూడడం తో , బాలయ్య తో సినిమా అనగానే అంత ఓకేంత షాక్ అయ్యారు. కానీ అసలైన పూరి మార్క్ సినిమా అంటే ఎలా ఉంటుందో పైసా వసూల్ తో నిరూపించాడు.
సినిమా అంత బాలయ్య హైలైట్ అయ్యే విధంగా డిజైన్ చేసి ఆకట్టుకున్నాడు. కథ, డైలాగ్స్ , యాక్షన్ ఇలా అన్ని సమపాలనలో ఉండేలా చూసుకొని సక్సెస్ అయ్యాడు. దేశం గురించి, దేశభక్తి గురించి చెప్పిన తీరు అందరికీ నచ్చుతుంది. కథ, కథనాల పరంగా కొద్దిగా తప్పులు దొర్లినా కథానాయకుడి పాత్ర ముందు అవేవీ పెద్దగా కనిపించవు. అక్కడక్కడా మాత్రం పూరి గత చిత్రాలు గుర్తుకొస్తాయి.
* ఇక అనూప్ రుబిన్స్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాలయ్య పాడిన ‘మామా ఏక్ పెగ్‌లా’ సాంగ్ మాత్రం అభిమానులను , ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
* జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ బాగుంది..ఎక్కడ కూడా సినిమా బోర్ కొట్టకుండా చూపించి సక్సెస్ అయ్యాడు.
* ముఖేష్.జి సినిమా ఫొటోగ్రఫీ సినిమా కు హైలైట్ గా నిలిచిందని. ఛేజింగ్ సన్నివేశాలతో పాటు సాంగ్ లొకేషన్స్ వంటివి చాల అందంగా చూపించాడు.
* నిర్మాణ విలువల విషయానికి వస్తే ఇప్పటివరకు ఏ మూవీ పెట్టలేని విధంగా ఈ మూవీ కి భారీ ఖర్చు పెట్టారు భవ్య క్రియేషన్స్ అధినేత వి.ఆనంద ప్రసాద్. ముఖ్యం గా పోర్చుగల్ లో సాగే కథ లో వారు పెట్టిన ప్రతి రూపాయి తెర ఫై కనిపిస్తుంది.
చివరిగా :
బాలకృష్ణ చేసిన 100 సినిమాలు వేరు..ఈ 101 పైసా వసూల్ మూవీ వేరు. బాలయ్య అభిమానులు ఇప్పటివరకు చూడని బాలయ్య ను ఈ మూవీ లో చూస్తారు. ఇక మాస్ ప్రేక్షకులు కోరుకునే ఫైట్స్ , మసాలా డైలాగ్స్ , రొమాన్స్ , మాస్ సాంగ్స్ ఇలా అన్ని ఉన్నాయి. టైటిల్ కు తగట్టే ప్రేక్షకులనుండి వసూల్ చేసే మూవీ గా పూరి తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. కామెడీ పెద్దగా లేకపోయినా బాలయ్య డైలాగ్స్ , కథలో వచ్చే ట్విస్ట్ లతో సినిమా ఆసక్తి రేపుతోంది. ఓవరాల్ గా ఇది ‘పూరి , బాలయ్య ల వసూల్ మూవీ ‘ అని చెప్పవచ్చు.

Comments
Post a Comment