మొటిమలను తగ్గించుకోటానికి కేవలం ఒకే రాత్రిలో ఉపశమనం

మొటిమలను తగ్గించుకోటానికి అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయారా? మొటిమలు పగిలిన తరువాత ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగించటం మరింత కష్టం అవునా! కానీ కేవలం ఒకే రాత్రిలో ఈ సమస్యలన్నిటికి ఉపశమనం అందించే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
1
ఐస్ థెరపీ
మొటిమలు మరియు వాటి వలన కలిగే ఎరుపుదనం, వాపులు మరియు ఇన్ఫ్లమేషన్ వంటి వాటిని ఈ థెరపీ ద్వారా త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ థెరపీ వలన రక్త ప్రసరణ మెరుగుపడటమే కాదు, శ్వేధ గ్రంధులను కూడా గట్టి పరుస్తుంది. దీనితో పాటుగా, చర్మంపై ఉండే దుమ్ము, ధూళి మరియు నూనెలను తొలగించుటకు సహాయపడుతుంది. చిన్న మంచు గడ్డను బట్టలో చుట్టి, మొటిమలు ఉన్న ప్రదేశంలో కొన్ని సెకన్ల పాటూ ఉంచండి. ఇలా కొన్ని సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
2
వైట్ టూత్పేస్ట్
మనం రోజు ఉదయాన వాడే టూత్పేస్ట్ దంతాలను మెరిసేలా మాత్రమేకాదు ఇతర లాభాలను కూడా చేకూరుస్తుందని మీకు తెలుసా? అవును నిజమే. టూత్పేస్ట్ మొటిమలను కూడా తగ్గిస్తుంది. దీనిలో చేయాల్సిందల్లా ఏంటంటే వైట్ టూత్పేస్ట్ ను మొటిమలపై అప్లై చేసి, అరగంట పాటూ అలాగే ఉంచాలి. ఇలా చేయటం వలన మొటిమల వలన కలిగిన వాపులు తగ్గటం మీరు గమనించవచ్చు.
3
స్టీం ట్రీట్మెంట్
స్టీం ట్రీట్మెంట్ ముఖానికి చాలా మంచిది ఎందుకంటే ఇది చర్మ రంద్రాలను తెరచి, చర్మం శ్వాస తీసుకునేలా చేస్తుంది. ఒక పెద్ద కంటెయినర్ ను తీసుకొని, అందులో కొన్ని వేడి నీటిని కలపండి. ఈ నీటి నుండి వచ్చే నీటి ఆవిరి మీ ముఖానికి తగిలే విధంగా కొద్ది సేపు ఉండండి. తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకొని, ఆయిల్-ఫ్రీ తేమభరిత లోషన్ లను అప్లై చేయండి.
4
అల్లం చేసే మాయాజాలం
యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే అల్లం మొటిమలను తగ్గించే సమర్థవంతమైన సహజ ఔషదంగా పేర్కొనవచ్చు. వీటితో పాటుగా, దీనిలో ఉండే సల్ఫర్ కారణంగా ఇది నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఒక అల్లం ముక్కను తీసుకొని, 5 నుండి 7 పాటూ ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి. తరువాత నీటితో కడిగి మళ్ళి అల్లం ముక్కను ఉంచండి. ఇలా తరచుగా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
5
గుడ్డు తెల్లసొన
ప్రోటీన్ లతో నిండి ఉండే గుడ్డుసొన మొటిమలను తగ్గించటమే కాదు ముఖ చర్మంపై ఉండే అవాంఛిత మరకలను మరియు వాపులను తొలగిస్తుంది. 3 గుడ్ల నుండి తెల్లసొనను తీసుకొని, 3 నిమిషాల పాటూ అలాగే ఉంచండి. ఒకసారి తెల్ల సొన సెట్ అయిన తరువాత, మొటిమలు ఉన్న ప్రాంతంలో చేతి వేళ్ళతో దీనిని అప్లై చేయండి. ఎండే వరకు వేచిఉండి, గోరు వెచ్చని నీటితో కడిగివేయండి. ఇలా రోజులో 4 సార్లు చేయటం వలన మొటిమల నుండి ఉపశమనం పొందుతారు.

Comments

am ad2

Popular posts from this blog

6 రోజుల్లో పొట్ట తగ్గించే ఉలవ జావ - తయారీ విధానం కూడా చాలా ఈజీ

జనతా గ్యారేజ్ ఆడియో లంచ్ అప్డేట్స్

ICICI PO Recruitment 2016